Holidays: వరుసగా సెలవులు.. కొందరికి హ్యాపీ.. వాళ్లకు మాత్రం పెద్ద చిక్కే!

Holidays: ఈ వీకెండ్ లో వరుసగా హాలీడేస్ వస్తున్నాయి. చాలామంది విద్యార్థులకు ఇది సరదానే. కానీ, కొంతమందికి పరీక్షలు జరుగుతున్నాయి. వారికి మాత్రం ఇబ్బందే.

Update: 2026-03-17 13:10 GMT

Holidays

Holidays: విద్యా సంవత్సరం చివరికి వచ్చేసింది. ఒక పక్క పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. కొందరికి వేరే పరీక్షలు కూడా నడుస్తున్నాయి. ఈ మధ్యలో వరుసగా సెలవులు వచ్చేశాయి. ఈ వీకెండ్ ఒక్కరోజు మినహా నాలుగు రోజులు విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. మధ్యలో ఒక్కరోజు ఎలానూ స్కూల్ ఎగ్గొట్టేసే ఆప్షన్ ఉంది కాదా. మొత్తం నాలుగు రోజులు ఎంజాయ్ చేసేయొచ్చు. కానీ, కొంతమంది విద్యార్థులకు మాత్రం ఈ సెలవులు పెద్ద ఇబ్బందే తెచ్చాయి. అవేంటో చెప్పుకునే ముందు అసలు నాలుగు రోజుల సెలవుల గురించి చెప్పుకుందాం.

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఈ నెల 19న అంటే గురువారం వచ్చింది. ఆరోజు తప్పనిసరి సెలవే కదా. తరువాతి రోజు అంటే 20వ తేదీ పండుగలు ఏమీ లేవు. అందుకే సెలవు లేదు. అయితే, ఆ తరువాతి రోజు ముస్లింల పవిత్ర రంజాన్ పండగ వస్తోంది. అంటే 21వ తేదీ శనివారం కూడా సెలవే. ఆ తరువాత 22వ తేదీ అంటే ఆదివారం ఎలానూ హాలీడేనే. అందువల్ల ఒక్క శుక్రవారం స్కూల్ మానేస్తే సరి.. నాలుగు రోజులు హ్యాపీ డేస్ పిల్లలకు.

అయితే, ఇన్ని సెలవులున్నా కొంతమంది విద్యార్థులకు మాత్రం ఇవి టెన్షన్ డేస్ అని చెప్పాలి. ఎందుకంటే, వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పదో తరగతి పిల్లలకు ఈ హాలీడేస్ పెద్ద ఇబ్బందే. అటు పండగ ఎంజాయిమెంట్ ఉండదు. మరోపక్క తోటి పిల్లలు అంతా ఆటపాటలతో హడావుడిగా ఉంటె ఇటు చదువు కోవడానికి మనసొప్పదు.

ఈ సెలవులు అన్నీ దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. అలాగే, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ వచ్చినట్లయింది. చాలామంది బయటకు తిరగడానికి ప్లాన్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తమ దృష్టి మరలిపోకుండా ఉండాలి. ఈ నాలుగురోజులు ఓపిక పడితే తరువాత ఫుల్ హాలీడేస్ వస్తాయి కదా.. అదే మైండ్ లో పెట్టుకుని పరీక్షలు బాగా రాసేయండి.

ఇక సెలవులు వచ్చాయని ఎంజాయ్ చేయడమే కాదు.. జాగ్రత్తగా ఉండాలి కూడా. వాతావరణం ఎండా.. వానా లా ఉంది. ఇలాంటి వాతావరణం చాలా ఆరోగ్య సమస్యలు తెస్తుంది. అందుకని బయట తిరిగేటప్పుడు జాగ్రత్త.

Tags:    

Similar News