Telangana Farmer News: టమాటా సాగుదారుల గుండె కోత..పాతాళానికి పడిపోయిన ధరలు..
Telangana Farmer News: మహబూబాబాద్ జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పండించిన పంట
Telangana Farmer News: టమాటా సాగుదారుల గుండె కోత..పాతాళానికి పడిపోయిన ధరలు..
Telangana Farmer News: మహబూబాబాద్ జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి, అప్పులు తెచ్చి పండించిన పంట.. మార్కెట్‌కు వచ్చేసరికి ధర పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో కిలో టమాటా కేవలం రూ. 2 పలుకుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పెట్టుబడి మట్టిపాలు:
విత్తనాలు, ఎరువులు, రవాణా ఖర్చుల సంగతి అటుంచితే.. కనీసం పంటను కోయడానికి అయ్యే కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశలన్నీ అడియాశలు కావడంతో, పొలాల్లోనే పంటను వదిలేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి విన్నపం:
ప్రభుత్వం తక్షణమే స్పందించి, టమాటా రైతులకు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని, నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా రైతాంగం కన్నీటితో వేడుకుంటోంది.