KTR: ‘మాయమైన దస్త్రం’పై సిట్ వేయాలి: అసెంబ్లీలో కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

KTR: తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Update: 2026-03-17 11:17 GMT

KTR: ‘మాయమైన దస్త్రం’పై సిట్ వేయాలి: అసెంబ్లీలో కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

KTR: తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "నేనే రాజు.. నేనే మంత్రి" అని అహంకారంతో వ్యవహరించేవారు సంపదను మూటగట్టుకుపోలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాయమైన దస్త్రం.. ఎక్కడ ఆ సంతకం?

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల అమలుపై కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. "తొలి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని, బహిరంగ వేదికపై సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఇప్పుడు ఏమైంది?" అని ఆయన ప్రశ్నించారు. ఏళ్లు గడుస్తున్నా సీఎం సంకల్పం, చిత్తశుద్ధి ఎటు పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ఫైల్‌కే దిక్కు లేకపోతే ఇక కాంగ్రెస్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. ఆ 'మాయమైన దస్త్రం' కోసం వెంటనే సిట్ (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తగ్గుతున్న ఐటీ ఉద్యోగాలు.. కేటీఆర్ ఆందోళన

రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితిపై కేటీఆర్ గణాంకాలతో సహా విమర్శలు చేశారు.

2023లో: ఐటీ ఉద్యోగుల సంఖ్య 9.46 లక్షలు.

ప్రస్తుత గవర్నర్ ప్రసంగం ప్రకారం: ఆ సంఖ్య 9.39 లక్షలకు పడిపోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 7 వేల ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వాస్తవం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఢిల్లీకి నిధులు ఇస్తున్నారా? తెస్తున్నారా?

కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధులు తెస్తారనుకుంటే, ఇక్కడి నుంచే అక్కడికి నిధులు ఇచ్చి వస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం నుంచి నిధులు తక్కువగా వచ్చినా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టామని, తెలంగాణ ఎప్పుడూ కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News