Breaking News: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ

Breaking News: ఇవాళ్టి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది

Update: 2021-04-20 06:41 GMT

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ  (ఫైల్ ఇమేజ్)

Night Curfew in Telangana: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళనృత్యం చేస్తోంది. కొన్ని రాష్ట్రాలు స్వల్ప లాక్ డౌన్ విధించగా ఢిల్లీ వంటి రాష్ట్రాలు 6 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 18 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్‌ బారిన పడ్డారు.

తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు గాలిలో కల్సిపోతుంటే..ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించింది. 48 గంటల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ, వీకెండ్ దీనిపై నిర్ణయం తీసుకోకపోతే తామే ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది.ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.





Tags:    

Similar News