Narendra Modi: తెలంగాణలో మోడీ వరుస సభలు.. వారం రోజుల్లో 6 సభలకు బీజేపీ ప్లాన్
Narendra Modi: అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్, గడ్కరీ, యోగీ ప్రచారం
Narendra Modi: తెలంగాణలో మోడీ వరుస సభలు.. వారం రోజుల్లో 6 సభలకు బీజేపీ ప్లాన్
Narendra Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మూడు రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణలో మకాం వేయనున్నారు. 24,25,27 తేదీలలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మోడీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో గిరిజన సదస్సు ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు.
24, 25, 28 తేదీల్లో 10కి పైగా బహిరంగ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 23, 25, 26, 27 తేదీల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించానున్నారు. 24,25,26 తేదీల్లో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ 10కి పైగా సభల్లో పాల్గొంటారు. 24,26 తేదీల్లో 6 సభలలో రాజ్ నాథ్ సింగ్ పాలుపంచుకుంటారు. 23 నుంచి 27వ తేదీల మధ్యలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.