Sangareddy: సంగారెడ్డి జిల్లాలో నిజాయితీని చాటుకున్న బీరంగూడకు చెందిన నరేందర్

Sangareddy: పోగొట్టుకున్న 18 తులాల బంగారంను బాధితుడికి అప్పగింత

Update: 2023-04-28 05:49 GMT

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో నిజాయితీని చాటుకున్న బీరంగూడకు చెందిన నరేందర్

Sangareddy: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో నరేందర్‌ అనే వ్యక్తి నిజాయితీని చాటుకున్నారు. సాయిభగవాన్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. విజయవాడలో తన సోదరుని నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో బస్ స్టాప్ వద్ద బ్యాగ్‌ను మరిచిపోయాడు. ఎంఐజీ కాలనీకి చెందిన నరేందర్... బ్యాగ్‌ను గుర్తించి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. అందులో సుమారు 10 లక్షల విలువగల 18 తులాల బంగారు నగలు ఉన్నట్లు గుర్తించారు. అయితే తన బ్యాగ్ మిస్సయ్యిందని.. నిరూప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు గోల్డ్ ఉన్న బ్యాగ్ నిరూప్‌దేనని గుర్తించి.. అప్పగించారు. బ్యాగ్‌ను తెచ్చి ఇచ్చిన నరేందర్‌ను పోలీసులు అభినందించారు.

Tags:    

Similar News