నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం..!
Nandamuri Family: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది.
నందమూరి రామకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం..!
Nandamuri Family: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారుని పక్కనే నిలిపి అక్కడి నుంచి రామకృష్ణ వెళ్లిపోయారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులు వచ్చి కారుని తీసుకెళ్లారు. కారులో ఆయన ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. అయితే.. నందమూరి కుటుంబంలో వరుస విషాద ఘటనలు జరగడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.