మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే
Mynampally Hanumantharao: తాను కాంగ్రెస్ నుండే పోటీ చేస్తానంటున్న నందికంటి శ్రీధర్
మైనంపల్లికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్యే
Mynampally Hanumantharao: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న మైనంపల్లితో పాటు ఆయన కుమారడు రోహిత్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్ని్కల్లో ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దాదాపు ఖరారైనట్టు.. పార్టీ నుంచి హామీ రావడంతో చేరికకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. ఐతే మైనంపల్లి రాకతో మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అలకబూనినట్టు తెలుస్తోంది. దీంతో నందికంటి శ్రీధర్‌ను సీఎల్పి నేతృత్వంలోని బృందం బుజ్జగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నందికంటి శ్రీధర్‌కి బీఆర్ఎస్ నుండి మల్కాజిగిరి టికెట్ అంటూ చర్చ జరుగుతోంది.