Siddipet: సిద్దిపేటలో ముర్షద్‌ గడ్డ ఉర్సు ఉత్సవాలు

Siddipet: మూడ్రోజులపాటు జరిగిన ముర్షద్‌ గడ్డ ఉర్సు ఉత్సవాలు

Update: 2022-01-05 08:19 GMT

సిద్దిపేటలో ముర్షద్‌ గడ్డ ఉర్సు ఉత్సవాలు

Siddipet: సిద్దిపేట ముర్షద్‌ గడ్డ ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీక. ఈ ఉరుసు ఉత్సవాల్లో ముస్లింలు, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అందరూ ఒకటే అనే నినాదంతో ఉత్సవాల్లో పాల్గొంటారు. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో అందరూ ఒకే చోట ఉంటూ సామరస్యాన్ని చాటుతారు. దీంతో ఈ పీఠం సర్వమత సమ్మేళనంలో కనిపిస్తోంది.ఉరుసు ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండే కాక కర్ణాటక, మహారాష్ట్రల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

దాదాపుగా 50వేలకుపైగా భక్తులు ధనిక, పేద అనే తేడా లేకుండా పాల్గొంటారు. ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి సిద్దిపేట ముర్శద్‌ గడ్డలో 41వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం జ్నానమృత కవ్వలి, చందన సుగంధాల సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. సోమవారం దీపాలంకరణ ఉత్సవం భజన, మంగళవారం ఖురాన్‌ పఠనం కార్యక్రమం జరిగింది.

Tags:    

Similar News