Nizamabad: నిజామాబాద్ సభలో టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన మోడీ
Nizamabad: తన సుదీర్ఘ ప్రసంగంలో మోడీ ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు?
Nizamabad: నిజామాబాద్ సభలో టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన మోడీ
Nizamabad: మోడీ-కేసీఆర్ భేటీ గుట్టును నిజామాబాద్ సభా వేదికపై విప్పేశారు భారత ప్రధాని. టాప్ సీక్రెట్స్‌ని బయట పెట్టేశారు. గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు కోసం ఢిల్లీ వచ్చిన కేసీఆర్... నన్ను ఆశీర్వదించాలని వేడుకున్నట్టు మోడీ సభలో ప్రకటించేశారు. అంతేకాదు, ఇక తాను బాగా అలసిపోయాను... పగ్గాలు కేటీఆర్‌కు అప్పగిస్తానంటూ కేసీఆర్ చెప్పారంటూ అసలు సంగతిని చెప్పారు.
ఇంతకాలం ప్రచ్ఛన్న యుద్ధంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ వార్ ఇప్పుడు డైరెక్ట్ అయ్యింది. గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు కోసం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చానంటూ మోడీ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్డీయేలో చేరుతాను, కేసీఆర్‌ను ఆశీర్వదించండి అంటూ తెలంగాణ సీఎం తన వద్దకు వస్తే... నిక్కచ్చిగా తోసిపుచ్చానంటూ మోడీ గుట్టు విప్పారు. ఇంకా పీఎం మోడీ ఏమన్నారో ఓసారి విందాం.
టార్గెట్ కేసీఆర్‌గా మోడీ నిప్పులు చెరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వమని కేసీఆర్ అడిగారంటూ అసలు సంగతేంటో చెప్పేశారు. కుదరదని తేల్చి చెప్పిన తర్వాత సీన్ మారిందంటూ చురకలంటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పానని మోడీ అన్నారు. ఎన్డీయేలో చేరుతానని కోరినా నేను సమ్మతించలేదన్నారు. కేటీఆర్‌కు పగ్గాలు అప్పగిస్తామంటే మీరేమైనా తెలంగాణకు రాజులా? అంటూ ప్రశ్నించానని మోడీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నుంచి మళ్లీ కలవలేదంటూ కేసీఆర్‌కు మోడీ చురకలంటించారు. నాడు కేసీఆర్ నాపై ఎక్కడ లేని ప్రేమ కురిపించారన్న మోడీ... నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదంటూ మండిపడ్డారు. ఇవాళ నేను వంద శాతం వాస్తవాలు చెప్పడానికే వచ్చానంటూ అసలు విషయాలు బయటపెట్టారు మోడీ.