Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam: తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈడీ విచారణ

Update: 2023-03-11 01:59 GMT

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ఈడీ కార్యాలయం చేరుకోనున్నారు. ఢిల్లీ ఈడీకార్యాలయ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో రాత్రి ఢిల్లీ చేరుకున్న కేటీఆర్, హరీశ్‌ రావు, న్యాయనిపుణులతో సుధీర్ఘంగా చర్చించారు. కేసులో ఉన్న లోపాలు, న్యాయపరమైన అంశాలపై సమాలోచనలు చేశారు. అబ్ధుల్ కలాం రోడ్ లోని ఈడీ కార్యాలయ ఆవరణలో 144 సెక్షన్ విధించారు. మీడియా ప్రతినిధులు తప్ప మరెవ్వరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన మనీష్ సిసోడియా, ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారి రామచంద్ర పిళ్లై, విజయనాయర్, సమీర్ మహేంద్రులపై సాగిన విచారణ తీరూతెన్నులను సంబంధీకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ చేరుకున్న లీగల్ టీమ్ ఎదురయ్యే పరిణామాలపై అన్నికోణాల్లో చర్చించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్... లో ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు, సౌత్ గ్రూప్ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందాలతో ప్రభుత్వ రాబడికి గండికొట్టినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ స్కామ్‌కు విజయనాయర్ సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం. సౌత్ గ్రూప్ నకు లబ్ధి చేకూరే విధంగా కొత్త లిక్కర్ పాలసీకి మెరుగులు దిద్దినట్లు అభియోగాలున్నాయి. లిక్కర్ వ్యాపారంలో హోల్ సేల్, రీటైల్ సేల్స్ ‌లో భారీగా మార్జిన్ ఉండేటట్లు పాలసీని సిద్ధం చేశారు.

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ సంస్థ హోల్ సేల్ డీలర్ గా వ్యవహరిస్తోంది. ఇండో స్పిరిట్ సంస్థలో 65 శాతం వాటాలు సౌత్ గ్రూప్ నకు చెందినవిగా ఈడీ విచారణలో వెల్లడైంది. రిటైల్ జోన్లు, మెజారిటీ జోన్లలో లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను సౌత్ గ్రూపు చేజిక్కించుకుంది. హోల్ సేల్ మార్జిన్‌ను 12 శాతం ఉండే విధంగా ఢిల్లీ ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. 12 శాతం మార్జిన్ లాభాల్లో ఆరు శాతం డీలర్‌కు, మరో ఆరు శాతం లాభాలను ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రీటైల్ మార్జిన్‌లోనూ ఆమ్ ఆద్మీనేతలకు ముడుపులు అందే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు.

Tags:    

Similar News