షర్మిల కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారెట్టు: కవిత ట్వీట్
MLC Kavitha Vs YS Sharmila : తెలంగాణ రాజకీయాలు ట్విట్‌వార్‌తో వేడెక్కుతున్నాయి.
షర్మిల కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారెట్టు: కవిత ట్వీట్
MLC Kavitha Vs YS Sharmila: తెలంగాణ రాజకీయాలు ట్విట్‌వార్‌తో వేడెక్కుతున్నాయి. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిల పార్టీపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అని ట్వీట్ చేశారు. దీంతో వైఎస్స్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా స్పందించారు.
పాలకపక్ష ఆగడాలు పతాక స్థాయికి చేరాయని..... ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ ప్రస్తుతం గూండాల పార్టీగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ఒక తాలిబన్ అని హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ సమస్య టీఆర్‌ఎస్ గూండాల కారణంగా వచ్చిందని షర్మిల ఆరోపించారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. షర్మిల కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారెట్టు అని విమర్శించారు. తాను ఉద్యమం నుంచి పుట్టిన మట్టి కవితనని తెలిపారు.