MLC Kavitha: కేంద్ర సర్కార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్..
MLC Kavitha గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదు
Mla Kavitha: కేంద్ర సర్కార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్..
MLC Kavitha: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం దక్కదన్నారు. ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవని పేర్కొన్నారు.
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని అన్నారు. భేటీ బచావో... భేటీ పడావో నినాదాలకే పరిమైందని తెలిపారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్నారు. మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆడబిడ్డల సంక్షేమం కంటే కేంద్రప్రభుత్వానికి కొందరి అభివృద్ధే ముఖ్యమన్నారు. ఆడబిడ్డ తలుచుకుంది... ఇక మీ అడ్రస్ గల్లంతవుతుందని ట్విట్టర్ వేదికగా అన్నారు.