MLC Kavitha: రైతుల గురించి అమిత్‌షా మాట్లాడటం హాస్యాస్పదం
MLC Kavitha: నల్ల చట్టాలను తెచ్చి రైతుల చావుకు కారణమైన పార్టీ బీజేపీ
MLC Kavitha: రైతుల గురించి అమిత్‌షా మాట్లాడటం హాస్యాస్పదం
MLC Kavitha: ఖమ్మంలో రైతు గోస - బీజేపీ భరోసా సభపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. రైతుల గురించి అమిత్‌షా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హంతకులే వచ్చి నివాళులర్పించినట్టు బీజేపీ తీరు ఉందన్నారు. నల్ల చట్టాలను తెచ్చి రైతుల చావుకు కారణమైన పార్టీ బీజేపీ అని ఫైర్ అయ్యారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతు సదస్సు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి.. వ్యవసాయాన్ని ఓ పండగలా చేసుకున్నామన్నారు కవిత. బీఆర్‌ఎస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత.