Yashaswini Reddy: గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు.. జీరో బిల్లును జారీ చేసి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy: గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు.. జీరో బిల్లును జారీ చేసి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
Yashaswini Reddy: రాయపర్తి మండలంలోని మైలారం గ్రామంలో గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు జీరో బిల్లును జారీ చేసి పథకాన్ని ప్రారంభించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అమలు చేస్తుందని, అమలు చేసిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయపర్తి మండల కేంద్రంలోని మహిళ సమైక్య భవనంలో ఏర్పాటు చేసిన... కిసాన్ సంవృద్ది యోజన చెక్కులను, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలని సామాజిక రాజకీయ రంగాలలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.