Mano Vignana Yatra 2022: జగిత్యాలకు చేరుకున్న మనోవిజ్ఞాన యాత్ర

* యాత్రని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

Update: 2022-11-19 11:18 GMT

జగిత్యాలకు చేరుకున్న మనోవిజ్ఞాన యాత్ర 

Mano Vignana Yatra 2022: మనోవిజ్ఞాన యాత్ర జగిత్యాలకు చేరుకుంది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనోవిజ్ఞాన యాత్ర ఏర్పాటు చేశారు. మనోవిజ్ఞాన యాత్రను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలపై జ్ఞానాన్ని పెంపొందించడానికి మనోవిజ్ఞాన యాత్రను ఏర్పాటు చేసిన సూపర్ ఫౌండేషన్ యువతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమైంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్‌నర్‌గా hmtv వ్యవహరిస్తోంది.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com

Tags:    

Similar News