ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రోడ్డు మధ్యలో ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్
MLA Rajasingh: గోషామహల్ MLA రాజాసింగ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రోడ్డు మధ్యలో ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్
MLA Rajasingh: గోషామహల్ MLA రాజాసింగ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. ప్రమాదం సమయంలో కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో రాజాసింగ్‌కు ఏం కాలేదు. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. అయితే తన భద్రతపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన విమర్శించారు.