హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ

తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని నీలిమ పిటిషన్‌

Update: 2024-01-30 04:11 GMT

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ

MLA Palla Wife Neelima: ఎమ్మెల్యే పల్లా భార్య నీలిమ హైకోర్టును ఆశ్రయించారు. భూ వివాదానికి సంబంధించి ఈనెల 23న పోచారం ఐటీ కారిడార్‌ పీఎస్‌లో నీలిమతో పాటు ఇద్దరిపై కేసు నమోదయ్యింది. కేసును కొట్టివేయాలని, నిజానిజాలు తేల్చాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారామె. ఆ భూమి తమదేనంటూ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను చూపుతూ... తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని నీలిమ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లో అక్రమంగా ప్రవేశించి... తనను దూషించారని ముగ్గురిపై కేసు పెట్టింది ముచ్చర్ల రాధిక.

Tags:    

Similar News