రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రం ప్రారంభం
ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి జన ఔషధీ జనరిక్ షాపును రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.
రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రం ప్రారంభం
అనంతపురం: ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి జన ఔషధీ జనరిక్ షాపును రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో మందులు అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని, కానీ జన ఔషధీ కేంద్రాలలో సగం కంటే తక్కువ ధరకే మందులు లభిస్తాయని తెలిపారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని, తక్కువ ఖర్చుతో వైద్య సేవలను పొందాలని కోరారు. ఈ కేంద్రాలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.