బాలకోటిరెడ్డి హత్యాయత్నం ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

*టీడీపీలో అంతర్గత కలహాలతో బాలకోటిరెడ్డిపై దాడి జరిగింది

Update: 2023-02-02 05:59 GMT

బాలకోటిరెడ్డి హత్యాయత్నం ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

MLA Gopireddy: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. అలవాలలో జరిగిన కాల్పుల ఘటనకు తమ పార్టీకి ఏవిధమైన సంబంధం లేదన్నారు. టీడీపీలో అంతర్గత కలహాల వల్లే బాలకోటిరెడ్డిపై దాడి జరిగిందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాలకోటిరెడ్డిపై దాడికి పాల్పడిన దోషులను ఖఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరామని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News