భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
*భద్రాచలంలో రెండో బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన
భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
Tummala Nageswara Rao: భద్రాచలంలో రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనుల పురోగతిపై నిర్మాణ సంస్థ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంలో జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఇంకా పూర్తి చేయకపోవడమేంటని అధికారులను ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరి లోపు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.