Srinivas Goud: సౌత్ కొరియాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యటన

Srinivas Goud: అమ్యూజ్‌మెంట్ పార్కును సందర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Update: 2023-07-05 13:46 GMT

Srinivas Gowd: సౌత్ కొరియాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యటన

Srinivas Goud: దక్షిణ కొరియాలో ఉన్న అత్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. సియోల్ నగరంలోని డి- మిలిటరీ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్‌ను మంత్రి సందర్శించి.. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని రాష్ట్రంలోనే ప్రఖ్యాత టూరిజం డెస్టినేషన్ గా మార్చడమే తమ ధ్యేయమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో రాబోయే 5 నెలల్లో నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాదులోనూ తీర్చిదిద్దుతామని తెలిపారు శ్రీనివాస్ గౌడ్.

Tags:    

Similar News