Puvvada Ajaykumar: లకారంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తారక్ తో మంత్రి పువ్వాడ భేటీ..
Puvvada Ajay: ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
Puvvada Ajaykumar: లకారంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తారక్ తో మంత్రి పువ్వాడ భేటీ..
Puvvada Ajay: ఈ నెల 28న ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్‌బండ్‌పై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 54 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. విగ్రహా విష్కరణ ఏర్పాట్లపై తారక్‌తో కాసేపు ముచ్చటించారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండనుంది. ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి.. విగ్రహం తరలింపునకు రంగం సిద్ధమైంది. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు.. మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది.