సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన
Ponnam Prabhakar: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి పొన్నం పర్యటన
Ponnam Prabhakar: సిరిసిల్ల నియోజక వర్గంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. అంతేకాకుండా, పలు పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులకు కాంగ్రెస్ కండువాలను కప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియమ్ లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, అలాగే ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు.
భూములను కొన్న వారి దగ్గరి నుండి ఆక్రమణలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పొన్నం నేతన్న విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పొన్నంకు భారీ గజమాలను అలంకృతం కావించారు. మంత్రి పొన్నం దారి మధ్యలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం మంత్రి పొన్నం కు కాంగ్రెస్ శ్రేణులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను సమర్పించారు.