Ponnam Prabhakar: పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది?
Ponnam Prabhakar: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ చెప్పారు.
Ponnam Prabhakar: పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది?
Ponnam Prabhakar: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ చెప్పారు. గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.. పదేళ్ల కాలంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. ప్రజలు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎవరెన్ని విమర్శులు చేసిన ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని పొన్నం అన్నారు.
గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ ఖండించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతాం అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.