Minister Ponnam: నేడు ఆటో యూనియన్స్‌తో మంత్రి పొన్నం సమావేశం
Minister Ponnam: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్
Minister Ponnam: నేడు ఆటో యూనియన్స్‌తో మంత్రి పొన్నం సమావేశం
Minister Ponnam: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఆటో కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమకు నష్టం జరిగిందని... తమకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మికులతో సమావేశం కావాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలోని 14 ఆటో యూనియన్ సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.