Malla Reddy: ఇవాళ ఐటీ కార్యాలయానికి మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: ఆర్థిక లావాదేవీలపై మల్లారెడ్డిని ప్రశ్నించనున్న అధికారులు

Update: 2022-11-28 01:05 GMT

Malla Reddy: ఇవాళ ఐటీ కార్యాలయానికి మంత్రి మల్లారెడ్డి

Malla Reddy: మల్లారెడ్డి ఆస్తులపై ఫోకస్ పెట్టిన ఐటీశాఖ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇవాళ ఐటీ కార్యాలయానికి రావాల్సిందిగా మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఐటీ అధికారులు రెండు రోజుల పాటు మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. ఐటీ రెయిడ్స్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన సన్నిహిత, సమీప బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బందువులు రఘునాథరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, సోదరులు గోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో దాదాపు 15 కోట్ల నగదుతో పాటు పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి విచారణకు రావాలని మంత్రి మల్లారెడ్డికి సమన్లు జారీ చేయగా.. మంత్రి మల్లారెడ్డి విచారణ కోసం ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

Tags:    

Similar News