కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR: వానాకాలం పంటలపై అవగాహన సదస్సులో పాల్గొననున్న మంత్రి
కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటన
Minister KTR: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. వానా కాలం పంటలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకుంటారు. బైపాస్ రోడ్డులోని వి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న అనంతరం జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాల-పెద్దపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో పాల్గొనున్నారు. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతు సదస్సులో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.