KTR: మొనగాడులాంటి కేసీఆర్ ఉన్నాక.. ఈ సన్నాసులు అవసరమా..?

KTR: కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీకి తరిమికొట్టాలి

Update: 2023-10-05 13:20 GMT

KTR: మొనగాడులాంటి కేసీఆర్ ఉన్నాక.. ఈ సన్నాసులు అవసరమా..? 

KTR: కాంగ్రెస్, బీజేపీని ఢిల్లీ వరకు తరిమికొట్టాలన్నారు మంత్రి కేటీఆర్. వికారాబాద్‌లో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ సభలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా అని, వికారాబాద్ జిల్లా కావాలన్న కలను కేసీఆర్‌ నెరవేర్చారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం దేవుడితోనైనా కొట్లాడతాం అన్నారు. వికారాబాద్ ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని, అన్ని ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. మొనగాడులాంటి కేసీఆర్ ఉన్నాక.. ఈ సన్నాసులు అవసరమా..? అన్నారు కేటీఆర్.

Tags:    

Similar News