మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసిన యువ గాయని.. అవ‌కాశ‌మిస్తామ‌న్న‌ డీఎస్పీ

Singer Shravani: పల్లెటూరులో పుట్టిన యువగాయని తెలంగాణ సాంస్కృతిక గేయాలు సినీ పాటలు పాడుతూ అందర్ని ఆకట్టుకుంటుంది.

Update: 2021-06-24 13:47 GMT

మంత్రి కేటీఆర్‌ను ఫిదా చేసిన యువ గాయని

Singer Shravani: పల్లెటూరులో పుట్టిన యువగాయని తెలంగాణ సాంస్కృతిక గేయాలు సినీ పాటలు పాడుతూ అందర్ని ఆకట్టుకుంటుంది. మెదక్ జిల్లా నార్సింగ్ కు చెందిన శ్రావణి చిన్నతనం నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టపడుతుండేది. ఇది గమనించిన ఆమె తండ్రి సంగీతం నేర్పించాడు. మధురమైన గొంతతో హుఎషారుగా పాటలు పాడటం మొదలు పెట్టింది. అందరిని మైమరిపించేలో పాటలు పాడుతుంది. శ్రావణి పాడిన పాటలకు ఆకర్షితుడైన సురేంద్ర తిప్పరాజు అనే నెటిజన్ ఆమె పాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కు షేర్ చేశాడు. ఆమె ట్యాలెంట్ కు మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరం అంటూ ట్విట్ లో కోరారు.

పల్లెటూరు గాయని శ్రావణి పాడిన పాటకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. అంతే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, దేవీశ్రీ ప్రసాద్ కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. శ్రావణి గాత్రం సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్ లను మంత్రముగ్దులను చేసింది. ఆమె స్వరం అద్భుతమంటూ ప్రసంశల వర్షం కురిపించారు. భవిష్యత్తులో నిర్వహించే షోలో మంచి అవకాశం ఇస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంతటి ప్రతాభావంతురాలిని తమదృష్టికి తీసుకువచ్చిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తాను పాడిన పాటలకు మంత్రి కేటీఆర్ స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది యువగాన కోకిల శ్రావణి. మరింత ప్రోత్సాహం కల్పించినట్లయితే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానంటుంది. 


Tags:    

Similar News