KTR Orders Toilet on Wheels: టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌...ఆగస్టు 15 నాటికి లక్ష్యం..

KTR Orders Toilet on Wheels: రాష్ట్రాన్ని అభివృద్ది చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

Update: 2020-07-16 09:11 GMT
minister KTR orders toilet on wheels

KTR Orders Toilet on Wheels: రాష్ట్రాన్ని అభివృద్ది చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మున్సిపాలిటీలను కూడా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 'టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సామాజిక టాయిలెట్ల నిర్మాణంపై దృష్టిసారించింది. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన 'స్త్రీ టాయిలెట్ల'ను ఆదర్శంగా తీసుకుని, ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. సమీప ఆర్టీసీ డిపోల నుంచి కాలంచెల్లిన బస్సులను తీసుకొని వాటిని 'స్త్రీ టాయిలెట్లు'గా మార్చాలని సూచించింది. టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌కు సంబంధించిన డిజైన్‌, ఏర్పాటుచేయాల్సిన వసతులను అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) సూచించింది.

ఈ మేరకు పురపాలకశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలే 'టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌' ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ కూడా ఆదేశించారు. వీటిని తక్కువ వ్యవధిలో పూర్తిచేయడంతోపాటు కావాల్సినచోటికి తరలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌) లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు లేదా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి వీటి నిర్వహణను అప్పగించాలని సూచించారు. ఈ టాయిలెట్లు రద్దీ మార్కెట్లు, పార్కులు, ప్రార్థనా మందిరాలు, పర్యాటకప్రాంతాలు, నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, వారాంతపు అంగళ్లు వంటి ప్రాంతాలకు తరలించవచ్చని అధికారులు చెప్తున్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల కోసం వసతులు కల్పించాలని స్పష్టంచేసింది.

అదనపు పరికరాలు/సౌకర్యాలు

- డెయిలీ యూజ్‌, క్లీనింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ రిజిస్టర్లు

- కంప్లయింట్‌ బాక్స్‌, హెల్ప్‌లైన్‌ నంబర్‌

- డస్ట్‌బిన్‌, చేతులు కడుక్కోవడానికి సబ్బు/హ్యాండ్‌వాష్‌

- శుభ్రమైన నీరు

- డోర్‌/కియోస్క్‌ వద్ద శానిటైజర్‌

- ఓడీఎఫ్‌, కరోనా వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక డిస్‌ప్లే

- ఈ టాయిలెట్లలో ఒక చిన్న దుకాణం వంటిది ఉంటుంది. ఇక్కడ శానిటరీ ప్యాడ్లు, మాస్కులు వంటివి అమ్ముతారు.

ఈ టాయిలెట్లలోని వసతులు

- తగినంత గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు

- ప్రకటనల బోర్డ్‌లకు ప్రత్యేక స్థలం

- దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేకంగా ర్యాంపు, లోపలి సౌకర్యాలు

- చంటిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక స్థలం

- వాష్‌ బేసిన్‌, అద్దం, కియోస్క్‌

- ఇండియన్‌, వెస్ట్రన్‌ కమోడ్‌

- వ్యర్థాల నిర్వహణకు బయోటాయిలెట్‌

- శానిటరీ ప్యాడ్‌ డిస్పెన్సర్‌ ఏర్పాటు

- టాయిలెట్‌ నిర్వాహకులకు ప్రత్యేక గది

- టాయిలెట్‌ను శుభ్రంచేసే సామగ్రిని దాచే స్థలం

- సోలార్‌ ప్యానల్‌ (అవసరాన్ని బట్టి)

Tags:    

Similar News