Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమావేశం

Telangana: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు

Update: 2021-02-24 06:34 GMT
మినిస్టర్ కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: కాసేపట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌, డిప్యూటీ మేయర్, వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్

సురభి వాణీదేవి రాజకీయాలకు కొత్త అని, ఆమె గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా కృషి చేయాలని కేటీఆర్ కోరానున్నారు. మాజీ ప్రధాని పీవీ కూతురు ను బరిలో నిలపడంతో ఛాలెంజ్ గా పనిచేయాల్సి ఉంటుంది అని కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆయా నియోజక వర్గాల్లో బాధ్యతలు అప్పగించనుంది టీఆర్ఎస్. ప్రతి యాభై మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఓ ఇన్ ఛార్జీని నియమించనుంది. ఈ సారి ఎలాగైనా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది.

Full View


Tags:    

Similar News