Minister KTR: సొమ్ము మాది.. సోకు మీదా..?
Minister KTR: తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్
Minister KTR: సొమ్ము మాది.. సోకు మీదా..?
Minister KTR: తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు చెప్పాలని ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ను ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తరప్రదేశ్ సోకులు పడుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పడుతున్నందుకు థాంక్స్ చెప్పాల్సింది పోయి.. ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్టుచేటన్నారు. ఆత్మవంచన చేసుకుంటే ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నరో అర్థమై పోతుందంటూ... మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి' అంటూ తెలంగాణ నుంచి కేంద్రం వసూలు చేస్తున్న గణాంకాలను పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు Dr.Laxman గారు?
— KTR (@KTRTRS) September 22, 2022
తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతున్నది
తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పండి
లెక్కలు తెలుసుకోండి👇 ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం కానీ ప్రజలని మభ్య పెట్టకండి pic.twitter.com/VrShH3nnPh