Kishan Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: తెలంగాణ ప్రజలకు దీపావళి దీపావళి శుభాకాంక్షలు
Kishan Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: హైదరాబాద్ చార్మినార్ వద్ద కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పండగ నేపథ్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.