ప్రజా ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉంది.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం - మంత్రి జూపల్లి

ఆదిలాబాద్‌ జిల్లా అనుకుంట కాలనీ బంగారి గూడ వార్డ్‌ 4లో ఇందిరమ్మ ఇంటిని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

Update: 2025-11-24 10:01 GMT

ఆదిలాబాద్‌ జిల్లా అనుకుంట కాలనీ బంగారి గూడ వార్డ్‌ 4లో ఇందిరమ్మ ఇంటిని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి.. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్ల రూపాయిల‌తో.. 4ల‌క్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాల‌ని ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని మంత్రి జూపల్లి తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందన్నారు.

Tags:    

Similar News