Jagadish Reddy: సామాన్య రైతుగా మారిన మంత్రి జగదీశ్ రెడ్డి..
Jagadish Reddy: ఏరువాక పౌర్ణమి సందర్భంగా విత్తనాలు వెదజల్లిన మంత్రి
Jagadish Reddy: సామాన్య రైతుగా మారిన మంత్రి జగదీశ్ రెడ్డి..
Jagadish Reddy: ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి సామాన్య రైతుగా మారిపోయారు. తన తండ్రి రామచంద్రారెడ్డి, తనయుడు వేమన్ రెడ్డితో కలిసి పొలంలో విత్తనాలు వెదజల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులను ప్రారంభించారు. రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోకుండా ఉండేందుకు సాగును ముందుకు జరపాలని, రోహిణి కార్తె పూర్తయ్యే నాటికి వరి నాట్లు పడాలని, తద్వారా రెండో పంటకు ప్రకృతి వైపరీత్యాల తాకిడి ఉండదని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఇదేమీ కొత్త పద్ధతి కాదని, గతంలో ఉన్నదేన్నారు.