శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
Harish Rao: మంత్రి హరీశ్‌కు ఘన స్వాగతం పలికిన ఆలయాధికారులు
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు
Harish Rao: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారి దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న హరీష్ రావుకు ఆలయ ఈఓ లవన్నతో పాటు సంబంధిత అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీశ్. ఆలయ అర్చకులు, వేదపండితులు ఆశీర్వచన చేసి హరీశ్ రావుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.