Minister Harish Rao : గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఘనత తమదే : హరీశ్‌రావు

Update: 2020-09-26 16:32 GMT

Minister Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఆడపిల్లలని ఎలా చూసేవారో తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆడపిల్లను ఇంట్లో లక్ష్మీ దేవతగా కొలుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లా చేగుంటలో శనివారం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టిన బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో మీటర్ పెట్టాలని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తండాల్లో, మారు మూల గ్రామాల్లో కరెంటు కరువు ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇలాంటి సమస్య లేదని రాష్ట్రంలో కరెంటుకు, ఎరువులకు ఎలాంటి కరువు లేదని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్రంలో మిటర్లు పెడితే కేంద్రం నుంచి 2500 కోట్లు ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ చొరవ ఎంతో ఉందని తెలిపారు.

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. చేగుంట మండలంలోని కిస్టాపుర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేస్తామని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ప్రతి తండాలో గుడిసెలు లేకుండా ఇల్లు కట్టిస్తామని తెలిపారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపుర్‌, రుక్మపుర్‌, చెట్ల తిమ్మై పల్లి అటవీ భూముల పరిష్కారం చేస్తామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో లక్ష ఇండ్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

Tags:    

Similar News