Harish Rao: ఆరోగ్య పరిరక్షణకు చెట్లను పెంచడం అవసరం.. పండ్ల మొక్కలను ఇంటింటికి అందజేస్తాం..

Harish Rao: సిద్దిపేటను ఆకుపచ్చ సిద్దిపేటగా మార్చాం

Update: 2023-07-30 04:46 GMT

Harish Rao: ఆరోగ్య పరిరక్షణకు చెట్లను పెంచడం అవసరం.. పండ్ల మొక్కలను ఇంటింటికి అందజేస్తాం 

Harish Rao: హరితహారంలో కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంటింటికి ఐదు మొక్కల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటను ఆకుపచ్చ, హరిత సిద్దిపేటగా మార్చుకున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేటలో ఉచితంగా పండ్ల మొక్కలను ఇంటింటికి అందజేస్తామని హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం హరితహారం చేపట్టడం జరిగిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో 20 వేల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు.

Tags:    

Similar News