Harish Rao: పంచే ప్రభుత్వం వైపుంటారా.. పెంచే ప్రభుత్వం వైపు ఉంటారా
Harish Rao: సంక్షేమ పథకాల ద్వారా పేదలకు కేసీఆర్ పంచుతున్నారు
పంచే ప్రభుత్వం వైపుంటారా.. పెంచే ప్రభుత్వం వైపు ఉంటారా -హరీష్
Harish Rao: కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు సీఎం కేసీఆర్ పంచిపెడుతుంటే కేంద్రం మాత్రం రేట్లు పెంచి నిరుపేదలను దోచుకుంటోందని విమర్శించారు. మరి ప్రజలు పెంచే ప్రభుత్వం వైపు ఉంటారా పంచే ప్రభుత్వం వైపు ఉంటారా తేల్చుకోవలన్నారు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులను కేంద్రం దేశం మొత్తం పంచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి కట్టేది ఎక్కువ కేంద్రం నుంచి తెలంగాణ వచ్చేది తక్కువన్నారు. దేశంలో ధరలు తగ్గాలంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు మంత్రి హరీష్ రావు.