Etela Rajender: కొవిడ్ తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష

Etela Rajender: కాసేపట్లో వైద్యాధికారులతో భేటీ * కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Update: 2021-04-07 06:54 GMT

మినిస్టర్ ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: తెలంగాణలో రోజురోజుకు కరోనా తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే అధికారులతో సమీక్షించిన మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా కట్టడిపై కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి పలువురు వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిచింది. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నా.. టెస్ట్‌లు నెమ్మదిగా చేయడమేంటని నిలదీసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కట్టడి వ్యూహాలకు పదునుపెట్టింది.

Tags:    

Similar News