Huzurabad: కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభ రద్దు

Huzurabad: రాష్ట్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్స్‌తో ప్రచారం

Update: 2021-10-22 08:21 GMT

హుజురాబాద్ లో అమిత్ షా భరంగా సభకు ఈసీ బ్రేక్ (ఫైల్ ఇమేజ్)

Huzurabad: ఈసీ నిబంధనలతో బీజేపీకి చెక్ పడినట్లయ్యింది. హుజూరాబాద్‌లో ప్రచారానికి కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతలు దూరంగా ఉండనున్నారు. బహిరంగ సభలకు ఈసీ నిబంధనల అడ్డుకానున్నాయి. కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభ కూడా రద్దైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్స్‌తో ప్రచారం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను టీఆర్ఎస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీంతో బీజేపీ జాతీయ నేతలతో సభలు, సమావేశాలు పెట్టించి టీఆర్ఎస్ నేతల విమర్శలను విమర్శలను తిప్పికొట్టాలని కాషాయ పార్టీ భావించింది. ముందుగా అమిత్‌షా తో హుజూరాబాద్‌లో బహిరం సభకు బీజేపీ ప్లాన్ చేసింది.

అయితే ఈసీ నిబంధనలతో ప్రచారానికి దూరంగా ఉండనున్నారు బీజేపీ జాతీయ నేతలు. బీజేపీ జాతీయ నేతలు ప్రచారానికి దూరం కావడంతో హుజురాబాద్ లో మూకుమ్మడి ప్రచారం చేస్తోన్న కాషాయ నేతలు. అయితే ఇప్పటికే హుజరాబాద్ లో ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా ముఖ్య నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.


Full View


Tags:    

Similar News