CM KCR: ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా భేటీ

CM KCR: మేఘాలయ సీఎం సంగ్మాను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్

Update: 2023-09-07 13:39 GMT

CM KCR: ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో మేఘాల‌య సీఎం సంగ్మా భేటీ

CM KCR: మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా హైదరాబాద్ లో పర్యటించారు. టూర్ సందర్భంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు వచ్చిన మేఘాలయ సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించారు. అనంతరం తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సీఎంలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, ఎర్రబెల్లి ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సిఎంకు కేసీఆర్ వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News