మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌తో జేఏసీ ప్రతినిధుల సమావేశం
KTR: నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని జేఏసీ ప్రతినిధుల హామీ
మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌తో జేఏసీ ప్రతినిధుల సమావేశం
KTR: మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న వక్ప్ బోర్డు సమస్య పరిష్కారానికి నేటితో తెర పడింది.మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో జేఏసి ప్రతినిధులు మంత్రి కేటిఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో మంత్రి కేటిఆర్ సానుకూలంగా స్పందించారని జేఏసి నేతలు తెలిపారు. దీనితో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వేసిన నామినేషన్లను వెనక్కి తీసుకుంటామని మంత్రి కేటిఆర్ కు జేఏసి ప్రతినిధులు హామీ ఇచ్చారు.