Secunderabad Fire Accident: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు.. ఆరుగురి దుర్మరణం
Secunderabad Fire Accident: 7, 8వ అంతస్తుల్లో ఎగిసిపడుతున్న మంటలు
Secunderabad Fire Accident: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు.. ఆరుగురి దుర్మరణం
Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. భవనంలో తొలుత మంటలు చెలరేగడంతో నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
మంటలు వ్యాపించిన నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లో మొత్తం ప్రైవేట్ కార్యాలయాలున్నాయి. మంటల వ్యాప్తికి పలువురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. సహాయ చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఉన్న ఏడుగురిని కాపాడారు. స్రృహ తప్పిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. నాలుగు గంటల శ్రమ అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మీ పరిశీలించారు.
ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులు ఉన్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో పలు బట్టల షాప్‌లు, గోడౌన్‌లు ఉన్నాయి. వారిలో ఉన్న వారు తమను కాపాడాలంటూ అర్తనాదాలు పెట్టారు. మృతులంతా 25 ఏళ్ల వయసులోపే వారిగా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలే వేసవికాలం ఎక్కడ ఎప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందతున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న డక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరవకముందే తాజాగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో నగర ప్రజలు భాయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ కాంప్లెక్స్‌లో మెుత్తం ప్రైవేటు కార్యాలయాలున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.