ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

*వజ్రోత్సవాల్లో భాగంగా ఉ.11.30కి సామూహిక జాతీయ గీతాలాపన

Update: 2022-08-16 03:09 GMT

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం

National Anthem Singing Program: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈనెల 22 వరకు వజ్రోత్సవాలను నిర్వహించనున్న ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ ఉదయం సరిగ్గా 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ అబిడ్స్‌ GPO సర్కిల్‌లో జరిగే జాతీయ గీతాలాపనలో కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ మేరకు ఆబిడ్స్‌, నెక్లెస్‌ రోడ్డు వద్ద ఏర్పాట్లు చేశారు. జీపీవో సర్కిల్ దగ్గర స్వాతంత్రయ సమరయోధుల చిత్రపటాలు, రంగు రంగుల బ్యానర్లు, మైకులను ఏర్పాటు చేశారు.

ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని సీఎస్ సోమేష్ కుమార్ కోరారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో సామూహిక గీతాలాపన కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిచోటా ఎక్కడివారక్కడ జాతీయ గీతాన్ని ఆలపించాలని సీఎస్ సోమేష్ కుమార్ కోరారు.

Tags:    

Similar News