Mask Must: మాస్క్‌ ధరించని వారికి రూ.1000 జరిమానా

Mask Must: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో మాస్క్‌ ధరించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.

Update: 2021-04-16 03:30 GMT

మాస్క్ పెట్టుకోవాలిన సూచిస్తున్న పోలీసులు

Mask Must: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో మాస్క్‌ ధరించని వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకోనివారికి వేయి రూపాయల ఫైన్‌ విధిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఇచ్చినట్టే ఈ-చలానా జారీ చేస్తున్నారు.

ఏప్రిల్‌ 5 నుంచి 11వతేదీ వరకు ఆరువేలకుపైగా మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. ఇప్పుడు వీరందరికి జరిమానాలు విధించారు. ప్రత్యేకంగా ప్రధాన రహదారులు, చౌరస్తాలలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న సిబ్బంది మాస్క్‌ ధరించని వారి ఫొటోలు తీస్తున్నారు. వారి ఆధార్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి ఈ-చలానా రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాస్క్‌ ధరించని 41వేల 249మందికి పోలీస్‌ శాఖ జరిమానాలు విధించింది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 15వేల 230మందికి ఈ-చలానాలు పంపింది. ఇక జరిమానా సొమ్ము చెల్లించని వారిని అరెస్ట్‌ చేస్తామంటున్నారు పోలీసులు.

Tags:    

Similar News