Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎప్పుడూ ఊహించలేదు..అందుకే రాజీనామా
Marri Shashidhar Reddy: నేటి నుంచి కాంగ్రెస్ హోంగార్డుగా ఉండటం లేదు
Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఎప్పుడూ ఊహించలేదు..అందుకే రాజీనామా
Marri Shashidhar Reddy: మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చాలా బాధతో రాజీనామా చేశానని.. పూర్తి వివరాలతో సోనియాగాంధీకి లేఖ రాసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండలేకపోయానని శశిధర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించే వ్యక్తులు హైకమాండ్‌కు ప్రతినిధిగా ఉంటూ అందరినీ సమన్వయం చేయాలని... తప్పులు, లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి... కానీ వారు పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా మారిపోయారని విమర్శించారు.