Maoist: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్, భారతక్క మృతి

Maoist: కరోనాతో చనిపోయినట్లు ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ నేతలు * లేఖ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత జగన్‌

Update: 2021-06-24 09:43 GMT

మావోయిస్టు హరిబుషణ్ & భారతక్క (ఫైల్ ఇమేజ్)

Maoist: అడవుల్లో ఉండే మావోయిస్టులకు కరోనా కష్టాలు తప్పడం లేదు. మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్, దంజకారణ్యం మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా కాటుకు బలయ్యారు. మావోయిస్టు్ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ అధికార ప్రతినిధి జగన్ అధికారిక ప్రకటన జారీ చేశారు. చాలాకాలంగా బ్రాంకైటీస్, అస్తమా వ్యాధులతో బాధపడుతున్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఈనెల 21న ఉదయం తుది శ్వాస విడువగా.. ఈ నెల 22 న ఉదయం భారతక్క మరణించినట్లు తెలిపారు. ఇద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించి..మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

హరిభూషణ్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం. హన్మకొండలో డిగ్రీ చదువుతూ 1991లో ఆర్ఎస్‌యూ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2015లో తెలంగాణ రాష్ర్ట కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. 2018లో కేంద్ర కమిటీలో స్థానం పొందారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన హరిభూషణ్‌ ఎన్నో సార్లు చావు అంచులకు వెళ్లి వచ్చారు. తుపాకి తూటాలను రెప్పపాటులో తప్పించుకున్నారు. చివరికి కరోనాకు బలయ్యారు.   

Tags:    

Similar News