Maoist Party: భూపతికి మావోయిస్టు కేంద్ర కమిటీ షాక్.. వెంటనే ఆయుధాలు అప్పగించాలని ఆదేశం
Maoist Party: మావోయిస్టు కేంద్ర కమిటీ సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ (అలియాస్ భూపతి)పై తీవ్ర చర్యలు తీసుకుంది. అతడిని ద్రోహిగా అభివర్ణిస్తూ, తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణమే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది.
ఈ నిర్ణయానికి కారణం, ఇటీవల వేణుగోపాల్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ప్రకటన విడుదల చేస్తూ, తాము ఆయుధాలను వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, ఈ ప్రకటనను కేంద్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. పార్టీపై వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలకు సంబంధించి అతడి ప్రకటనలను ఖండిస్తూ, లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
కాగా, భూపతి సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు (అలియాస్ కిషన్‌జీ)కి సోదరుడు.